మాన్ దొడ్డిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన
ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు.
జోగులాంబ గద్వాల 23 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఆలంపూర్. నియోజకవర్గ పరిధిలోని రాజోలి మండలం మాన్ దొడ్డి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలు, ఈదురు గాలులు రైతన్నకు తీరని వేదనను మిగిల్చాయి. గ్రామంలో సుమారు 1140 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలపాలై, నీటిలో తడిసి ముద్దవ్వడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆలంపూర్ శాసనసభ్యులు శ్రీ విజయుడు గురువారం మాన్ దొడ్డి గ్రామంలో దెబ్బతిన్న వరి పంటలను, వర్షపు నీటిలో తడిసిపోయిన మొక్కజొన్న ధాన్యాన్ని ఆయన స్వయంగా రైతులతో కలిసి పరిశీలించారు. పంటను కోల్పోయి రైతులతో మాట్లాడి, వారికి మనోధైర్యాన్ని తెలుపుతూ,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ....చేతికొచ్చిన పంట కళ్ళముందే వర్షార్పణం కావడం అత్యంత బాధాకరం. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తరపున ఆదుకుంటాం. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.