మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడిన డాక్టర్ మమత రెడ్డి!
హన్మకొండ జిల్లా:జులై 26
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆదివారం ఉదయం గుండె పోటు రాగా వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సకాలంలో డాక్టర్ మమత రెడ్డి, స్పందించి సిసిఆర్ ద్వారా ప్రాణాలు కాపాడిన రోహిణి ఆసుపత్రికి చెందిన డాక్టర్ మమతను మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు,ప్రశంసించారు.
హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి చెందిన డాక్టర్ మమతారెడ్డి. నర్సం పేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,కి ఈరోజు తీవ్ర గుండె పోటుకు గురికాగా, సమయస్ఫూర్తితో స్పందించిన డాక్టర్ మమత తొమ్మిది సార్లు సీపీఆర్ నిర్వహించి ఆయన ప్రాణాలను కాపాడారు.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టువదలకుండా నిరంతరం సీపీఆర్ కొనసాగించి గుండె మళ్లీ స్పందించేలా చేయడంతో బిఆర్ ఎస్ శ్రేణులతో పాటు వైద్య సిబ్బంది ఆమె సేవలను అభినంది స్తున్నాయి. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం..