మహేశ్వరి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఆర్మీ జవాన్ అమరబోయిన లింగరాజు యాదవ్
పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా నిలబడి 5000 రూపాయలు సహాయం చేసిన ఆర్మీ జవాన్ అమరా బోయిన లింగరాజు యాదవ్.ఇటీవల గణపవరం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని రజక కులానికి చెందిన పగిళ్ల మహేశ్వరి మునగాల మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ అనారోగ్యంతో మృతి చెందింది మహేశ్వరిది చాలా నిరుపేద కుటుంబం తమ్ముడు గణపురం హైస్కూల్లో చదువుతున్నాడు నాయనమ్మ వయోభారంతో ఉండడంతో పగిళ్ల సాయి భార్గవ్ జీవితం ప్రశ్నార్థకంగా మారింది ఇట్టి విషయాన్ని తెలుసుకుని గణపవరం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అమరబోయిన లింగరాజు యాదవ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి మండల బిజెపి అధ్యక్షుడు భద్రం రాజ్ కృష్ణ ప్రసాద్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ చేతుల మీదుగా సోమవారం నాడు ఆ కుటుంబానికి 5000 రూపాయలు అందజేసి మాట్లాడుతూ పచ్చిపాల రామకృష్ణ యాదవ్ శతకోటి వీరయ్య ఆ కుటుంబానికి అండగా ఉన్నందుకు అభినందించి మాట్లాడుతూ భవిష్యత్తులో భరోసాగా ఉంటానని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కూడా తల్లిదండ్రులు లేని అనాధనినని కానీ నా పెదనాన్న పెద్దమ్మల దగ్గర ఉండి కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సంపాదించానని అన్నారు పేదల కష్టాలు తనకు తెలుసునని అన్నారు ఈ సందర్భంగా సహాయం ఫౌండేషన్ చైర్మన్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ శతకోటి వీరయ్య మాట్లాడుతూ ఆ కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజు గారికి గ్రామంలో ఉద్యోగస్తులు ఎన్నారైలు యువత బయటి ప్రాంతాల వారు కూడా సహాయం చేయడం వలన ఆ పాప కుటుంబానికి 1,35,000 బియ్యం సమకూరాయని ఆ డబ్బులను గ్రామ పెద్దల సమక్షంలో ఆ కుటుంబం పేరిట ఫిక్స్ లు డిపాజిట్ చేస్తామన్నారు సహకరించిన దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఆ కుటుంబనికి సహాయం అందించే విషయంలో పాత్రికేయ మిత్రులు వివిధ కథనాలు ప్రచురించడం ద్వారా ఇంతటి సహాయం అందిందని వారికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతి గ్రామంలో అన్ని కులాలలో పేదవారు అనాధలు ఉన్నారని వారిని ముందే గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామీణ ప్రాంతాలలో ఆ కుటుంబాల పట్ల గ్రామస్తులు పెద్ద మనసు చేసుకొని సహాయం చేయాలని వేడుకున్నారు ప్రతి గ్రామంలో చైతన్యం వచ్చి సహాయం చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అన్నారు మనం జన్మించినప్పుడు తీసుకుని వచ్చేది ఏమీ లేదని మరణించేటప్పుడు తీసుకొని పోయేది ఏమీ లేదని అనివార్యముగు ఈ విషయం నందు ప్రతి ఒక్కరు పదిమందికి సహాయం చేసి బతకాలని పిలుపునిచ్చారు ఏ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఆరాధ్య ఫౌండేషన్ సహాయం ఫౌండేషన్ అండగా ఉంటామన్నారు బీసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెవిరాల సీతారామయ్య బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలంపల్లి సుధాకర్ గౌడ్ సహకారం మరువ లేనిది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నెమ్మది దేవయ్య గోపి గౌడ్ మహేష్ యాదవ్ చెవిరాల పోతులూరి చారి మణికంఠ ఆంజనేయులు వినోద్ నరేష్ శీను చందర్రావు లింగరాజు రామకృష్ణ తదితరు యువకులు పాల్గొన్నారు