మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే మందుల సామేల్
అడ్డగూడూరు 4 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిన్న పరిశాల జానకిపురం గ్రామాలలో మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే మందుల సామేల్ చేశారు. చిన్నపడిశాల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సర్పంచ్ సులోచనను గ్రామపంచాయతీ కార్యాలయంలోకి ఆహ్వానించి చైర్ పై కూర్చోబెట్టారు. అనంతరం చిన్నపడిశాల గ్రామంలో మహిళా సంఘాల భవనానికి శంకుస్థాపన చేశారు. పక్క గ్రామమైన జానకిపురం గ్రామానికి చేరుకొని ఎమ్మెల్యే మందుల సామేల్ మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘ భవనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మహిళా సంఘ సమస్యల గురించి మహిళల గురించి ఈ భవనము కట్టిన తర్వాత ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. రైతులకు సరిపడే నీరు బిక్కేరు వాగుకు వారం రోజులుగా నీరు విడుదల చేస్తానని అన్నారు. మానాయకుంట నుండి జానకిపురం వరకు రోడ్డు మరమ్మతులు తొందర్లోని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శేషగిరిరావు, ఎంపీడీవో శంకరయ్య, ఎంపీ ఓ కళావతి,మండల అధ్యక్షుడు నిమ్మన గోటి జోజి,పిఎసిఎస్ కొప్పుల నిరంజన్ రెడ్డి చిన్నపడిశాల సర్పంచ్ సుశీల,జానకిపురం సర్పంచ్ సమ్మయ్య, జానకిపురి గ్రామంలో 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే సహోదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.టిపిసిసి రాష్ట్ర నాయకులు బాలెoలా సైదులు,మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్లు చిత్తలూరు సోమన్న,బాలేoల విద్యాసాగర్,వివిధ గ్రామాల సర్పంచులు మహిళా సంఘ నాయకురాలు,సంఘ సభ్యులు,గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.