మహిళా రిజర్వేషన్ బిల్లు lo బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలి..
మునగాల 30 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌కోటా తప్పనిసరిగా కల్పించాలని జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి తోకల సైదులు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పాలన వ్యవస్థలో వెనుకబడిన వర్గాల మహిళలకు సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడం ఆందోళనకరమని తెలిపారు.
దేశ జనాభాలో మహిళలు దాదాపు 40 శాతం ఉన్నప్పటికీ, రాజకీయ రంగంలో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీ మహిళలు సామాజిక–ఆర్థిక రంగాల్లో ఇంకా వెనుకబడి ఉండటంతో, వారికి ప్రత్యేక అవకాశాలు కల్పించకపోతే నిజమైన సమానత్వం సాధ్యమవదని అన్నారు.
ఇప్పటి వరకు కొద్ది వర్గాలకే అధికారాలు కేంద్రీకృతమయ్యాయని, భవిష్యత్తులో అన్ని వర్గాల మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌కోటా కల్పించడం ద్వారానే సామాజిక న్యాయం ప్రతిష్ఠించబడుతుందని సైదులు స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో కేంద్ర ప్రభుత్వం తక్షణ సవరణలు చేసి బీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.