మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడుదాం.

Mar 2, 2025 - 21:33
Mar 2, 2025 - 21:34
 0  53
మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడుదాం.

స్త్రీ పురుష సమానత్వానికై పోరాడుదాం. 

పరువు హత్యలను అరికట్టాలి. 

మార్చి 8వరకు జరిగే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలను  

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిద్దాం.

 - మారసాని చంద్రకళ పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు.

సూర్యాపేట  2 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-  అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలను మార్చి 8వ తేదీ వరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహించాలని పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ పిలుపునివ్వడం జరిగింది. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లెనిన్ నగర్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మహిళ వ్యతిరేక విధానాలపైన నిరంతరం పోరాడాలని అన్నారు. రోజురోజుకు మహిళల పైన దాడులు దేశవ్యాప్తంగా తీవ్రతరం అవుతున్నాయన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన అప్పటినుండి అనేక మణిపూర్ లాంటి ఘటనలను సృష్టించిందని వారన్నారు. పరువు హత్యల పేరుతోటి ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా మహిళలను పురుషులను చంపుతూన్నారన్నారు. స్త్రీ పురుష సమానత్వం నేటికీ సాధించలేక పోతున్నాం అన్నారు. అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్న వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉందన్నారు. వీటికి వ్యతిరేకంగా మహిళ లోకం పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన అవసరం ఉంది అన్నారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయింది అని గొప్పలు చెప్పుకుంటున్న మహిళల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉంది అన్నారు. 13 నిమిషాలకు ఒక్క మహిళ మరణ వార్త వినే పరిస్థితి దేశంలో ఉంది అన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా స్రీ ,పురుష సమానత్వం కై మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేంతవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, సహయ కార్యదర్శి సంతోషి మాత, కోశాధికారి జయమ్మ, జిల్లా నాయకులు ఐతరాజు పద్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333