మహిళకు దీనిపై తప్పక అవగాహన కల్పించాలి : కలెక్టర్*

Feb 24, 2025 - 20:03
 0  1

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి.

**గద్వాల .*

జిల్లాలో ఈనెల 24 నుంచి 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహించి బ్యాంకు లావాదేవీలపై మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళలకు పొదుపు, బ్యాంకులలో అకౌంట్ తెరవడం, బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం తదితర 65 అంశాలపై వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రంలో బ్యాంకర్లు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఎల్ డి ఎం అయ్యప్పరెడ్డి లతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333