మహాత్మ జ్యోతిరావు హాస్టల్లో విద్యార్థినులు తినే ఆహారంలో కల్తీ.
హాస్టల్లో దొడ్డు అన్నం.
ఎట్లా ఉంటే మాకు ఏమి మేము వండేది అంతే అన్నట్లు ఉంది.
విద్యార్థుల పట్ల పట్టించుకోని ప్రిన్సిపాల్.
అడిగే వారే లేరా?.
జోగులంబ గద్వాల 9 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఉండవెల్లి జులై 08: విద్యార్థులకు సరైన మెంటెనెస్ లేక పిల్లలు అనారోగ్యనికి గురి ఐతున పట్టించుకోని సిబంది, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలేగురుకుల పాఠశాల కళాశాల హాస్టల్ సిబ్బంది ఉపాధ్యాయులు. పట్టించుకోని అధికారులు ఒక్కసారి కూడా అడుగు పెట్టని జిల్లా విద్యా శాఖ అధికారి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోనీ ఉండవల్లి మండలం పుల్లూర్ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల కళాశాలలో గత ప్రభుత్వము విద్యార్థుల కొరకు పాఠశాల కళాశాల మంజూరు చేయడం జరిగింది.అయితే ఇంతవరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు,అక్కడ నిత్యం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది.
వందలాది మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో త్రాగడానికి నీరు లేక.పండుకోవడానికి సరైనటువంటి వసతులు లేక.మరియు హాస్టల్ పోలంలో ఉండగా అప్పుడప్పుడు పాములు వస్తూ ఉంటాయి .ఆ పాములు వచ్చినపుడు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.కొందరు విద్యార్థులు భయముతో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి.ఇన్ని సమస్యలు ఉన్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్. ఉపాధ్యాయులు సిబ్బంది.
అక్కడ ఎవరైనా విద్యార్థినిలు ఏమైనా అడిగితే మీ ఇండ్ల దగ్గర ఇలాగే ఉంటుంద అని బెదిరిస్తున్నారు. కూతవేటు దూరంలో నియోజకవర్గ ఎమ్మెల్యే, మ్మెల్సీలు ఉన్న సమస్యలు పరిష్కారం చూపడంలో విఫలం అయ్యారని చెప్పవచ్చు. ఇకనైనా పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు అన్ని విధాలుగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ని ప్రజలు కోరుతున్నారు.