మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించిన ఎల్లేని సుధాకర్ రావు
11-04-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం:- ఈరోజు చిన్నంబావిలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి వేడుకల్లో భాగంగా స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన ఎల్లెని సుధాకర్ రావు, జగ్గారి శ్రీధర్ రెడ్డి, చిన్నంబావి మండల అధ్యక్షుడు కురుమయ్య. ఈ సందర్భంగా ఎల్ లేని సుధాకర్ రావు మాట్లాడుతూ బడుగు బలహీన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి కష్టపడి కృషి చేసిన మహోన్నత వ్యక్తి మన మహాత్మ జ్యోతిరావు పూలే గారని వారు స్త్రీల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అంతటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు మనం అందరం ఈరోజు ఇంత గొప్పగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వారి ఆశయ సాధన కోసం మరి మనమందరం కృషి చేయాలని ఆ దిశగా మన ఆలోచన విధానం కూడా మారాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఏల్లేని సుధాకర్ రావు గారితో పాటు, జగ్గారి శ్రీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కురుమయ్య, కార్యకర్తలు గూడెం మేకల శివ యాదవ్, బిక్కిం గంగపుత్ర వెంకటయ్య, సర్పంచ్ రమేష్, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.