మద్యానికి బానిసై నిండు జీవితాన్ని ఆగం చేసుకోవద్దు

Jun 24, 2025 - 20:15
Jun 25, 2025 - 18:24
 0  1
మద్యానికి బానిసై నిండు జీవితాన్ని ఆగం చేసుకోవద్దు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : మద్యానికి బానిసై నిండు జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. సామాజిక కార్యకర్త ప్రభాకర్. ఆత్మకూర్ ఎస్ మద్యం గుట్కా గంజాయి హెరాయిన్ వంటి కి అలవాటు పడి యువత తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకోవద్దని కోరుతూ ప్రభుత్వ టీచర్ సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ మంగళవారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన పుర్రె గుర్తు ఉన్న నల్లటి అంగీ ధరించి మెడలో పుర్రెల మాలలు వేసుకొని డేంజర్ గుర్తుతో టోపీ పెట్టుకుని చేతిలో మైకు పట్టుకొని కన పడిన వ్యక్తి కల్లా పాంప్లెట్ పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదిక పోలీస్ స్టేషన్ లో ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంతకాలంగా యువత మద్యం మత్తు పదార్థాలకు అలవాటు పడి ప్రమాదాల బారిన పడుతూ తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారని దీంతో వారిని నమ్ముకున్న తల్లిదండ్రులు భార్య పిల్లలు అనాధలవుతున్నారని యువత చెడు మార్గాల దారిన పడకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ సామాజిక సేవలో భాగంగా మత్తు పదార్థాలు మత్తు పాన్యాలకు వ్యతిరేకంగా విచిత్ర వేషధారణతో సామాజిక చైతన్యం కల్పించడం అభినందనీయమని అన్నారు.