మద్యం మత్తులో వాహనాలు నడపరాదు ఎస్సై వెంకట్ రెడ్డి
తిరుమలగిరి 19 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
అరైవ్ - అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు తిరుమలగిరి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఎస్ఐ వెంకట్ రెడ్డి వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని, నేరమని తెలిపారు. జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం మత్తు వల్ల ఎదుటివారి కూడా ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసు సూచనలను పాటించాలని అన్నారు. నిత్యం మద్యం మత్తు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు....