మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం
జోగులాంబ గద్వాల 8 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడం తో పాటు వాటికి ఆకర్షితులు అయిన యువతను తిరిగి యధాస్థితికి తీసుకవచ్చేందుకు బ్రహ్మ కుమారీస్ ఈశ్వరియా విశ్వ విద్యాలయం వారు చేస్తున్నా కృషి అభినందనీయం ఆని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా జిల్లా లోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో యువతకు అవగాహాన కల్పించేందుకు బ్రహ్మ కుమారీస్ ఈశ్వరియా విశ్వ విద్యాలయం వారు ఏర్పాటు చేసిన వ్యసనముక్త భారత్ అభియాన్ ర్యాలీని జిల్లా ఎస్పీ ఈ రోజు జిల్లా కేంద్రం లోని బ్రహ్మ కుమారీస్ కేంద్రం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలనీ, వాటికి అలవాటు పడి తమ విలువైన బంగారు భవిషత్తు ను వినాశనం చేసుకోవద్దని అన్నారు . యువత ఎల్లప్పుడూ తమ భవిష్యత్ లక్ష్యాల పై దృష్టి పెట్టీ మంచి భవిష్యత్ ను నిర్మించుకోవాలని అన్నారు. మత్తు పదార్థాల వినియోగం కు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం తో పాటు చెడు వ్యసనాలకు గురైన వారు తిరిగి యధాస్థితికి తీసుక వచ్చేందుకు బ్రహ్మ కుమారీస్ ఈశ్వరియా విశ్వ విద్యాలయం వారు జిల్లాలో ఊరూరా చేపడుతున్నా అవగాహన కార్యక్రమం ఎంతో అభినందనీయం ఆని, ఇలాంటి కార్యక్రమాలకు పోలీస్ ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉంటుందని అన్నారు. యువత బంగారు భవిష్యత్ ను వినాశనం వైపు తీసుకెళ్తున్న మత్తు పదార్థాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీస్ TNAB కూడా అనేక చర్యలు తీసుకుంటుందని, జిల్లా లో పోలీసు యంత్రాంగం రోజు ఏదో ఒక చోట మత్తు పదార్థాల దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు, మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, జిల్లా లో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణా, వినియోగం గురించి సమాచారం తెలిస్తే పోలీస్ వారికి సమాచారం అందించాలని అన్నారు.
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రత్యేక వాహనం పై కుంభకర్ణుడి బొమ్మల రూపంలో ప్రదర్శన ద్వారా చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం అందరినీ ఆకర్షిస్తుందని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో డి. ఎస్పీ శ్రీ వై మొగిలయ్య, ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ్య విశ్వ త విద్యాలయం రాజయోగి మంజుల , గద్వాల్ సిఐ టంగుటూరు శ్రీను, రూరల్ ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.