మంత్రి దృష్టికి నేతన్నల సమస్యలు

Oct 8, 2024 - 19:50
 0  6
మంత్రి దృష్టికి నేతన్నల సమస్యలు

జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్. పర్యటనకు వచ్చిన దేవాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ నిAICC కార్యదర్శి సంపత్ కుమార్ ని కలిసిన జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం( TRPS) అధ్యక్షుడు కోట నరసింహులు మంత్రి ని కలిసి నడిగడ్డ నేతన్నల సమస్యలపై వినతి పత్రం ఇచ్చి చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలో 2008వ సంవత్సరం లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్వాల నేతన్నల అభివృద్ధి కొరకు కేటాయించిన 50 ఎకరాల భూమిని హ్యాండ్లూమ్ పార్క్ గా ప్రకటించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ యొక్క పార్కును అభివృద్ధి చేయకపోవడం చాలా దురదృష్టకరమని గద్వాల జిల్లాలో చేనేత కార్మికులు చాలామంది నివసించడానికి నివాస గృహాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇళ్లల్లో చేనేత కార్మికులకు ప్రత్యేక వాటా కేటాయించాలని అదేవిధంగా హ్యాండ్లూమ్ పార్క్ లో హౌస్కం వర్క్ స్కీం ఇంప్లిమెంటేషన్ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మళ్లీ పునరుద్ధరించాలని మంత్రిదృష్టికి తీసుకెళ్లి డిమాండ్ చేయడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ టిపిసిసి చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు చిన్ని నాగరాజు రాజోలు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులిపాటి దస్తగిరి పగడాకుల శంకర్ మారుతి వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333