భూభారతిలో వచ్చిన దరఖాస్తులన్నీ ఆన్లైన్లో చేయాలి
అదనపు కలెక్టర్ వీరారెడ్డి

అడ్డగూడూరు 28 జూన్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం రోజు అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పర్యవేక్షించారు.2064 వివిధ సమస్యలపై ఉన్న దరఖాస్తులను జూలై 31 లోగా విచారణ చేసి ఆన్లైన్లో నమోదు చేసి పరీక్షించాలని అధికారులకు ఆదేశించారు. దరఖాస్తుల్లో ఎలాంటి పొరపాటులకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శేషగిరి రావు, డిటి నరసింహారావు,ఆర్ఐ రాజేష్,ఉపేందర్, జూనియర్ అసిస్టెంట్లు నాగేష్ కుమార్, శ్రీనివాస్, కార్యాలయం సిబ్బంది తదితరులు ఉన్నారు.