భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

Nov 14, 2024 - 15:56
 0  7
భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్
భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

జోగులాంబ గద్వాల 14 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల .నేటి పిల్లలను భావి భారత భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవితో కలిసి జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషమని అన్నారు. అన్ని సామాజిక వర్గాల పిల్లలందరికీ సమాన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు.పిల్లల అభ్యాసం, వారి సమగ్ర అభివృద్ధికి బాల సధాన్ మంచి గుణాత్మక విద్యతో పాటు,వివిధ కార్యక్రమాలు అందిస్తోందని తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం, వ్యక్తిగత శ్రద్ధ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతూ,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. "ఇవాళ్టి పిల్లలు రేపటి పౌరులు” అని పేర్కొంటూ, పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవి మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ చిల్డ్రన్స్ హోమ్ మీకు భద్రతగా, సురక్షితంగా ఉంటుందని అన్నారు. మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి, మీ అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని అన్నారు. పిల్లలు సంతోషంగా ఉండి, బాగా చదివి, జీవితంలో విజయవంతులు అవ్వాలని అన్నారు. బాల సదనాన్ని తరచుగా సందర్శిస్తూ ఉంటారని, ఇక్కడ పిల్లలందరికీ విద్యతో పాటు మంచి భోజనం పౌష్టిక ఆహారంతొ పాటు వ్యక్తిగత ప్రత్యేక శ్రద్ధలు అందించడం జరుగుతుందన్నారు. బాలసదనంలో ఉన్న పిల్లలందరూ అదృష్టవంతులని తెలిపారు. అనంతరం బాలల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఈనెల 8 నుండి 14 వ తేదీ వరకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన పిల్లలకు జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మెమెంటోలు, స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. పిల్లలందరితో కలిసి కేక్ కట్ చేసి ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమలో శిశు సంక్షేమ శాఖ అదికారి  సుధారాణి, సి. డబ్ల్యూ. సి. చైర్మన్ సహదేవులు, సభ్యురాలు శైలజ, కోఆర్డినేటర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333