భారతరత్న శ్రీ పీవీ నరసింహారావు 104వ జన్మదిన వేడుకలు ఘనంగా""ముఖ్యఅతిథిగా శ్రీ డాక్టర్ తుమ్మల యుగంధర్

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : పివి మార్గ్ (ఆర్ & బి అతిధి గృహం, మామిళ్ళగుడెం) భారత దేశ ఆర్ధిక సంస్కరణల రూపశిల్పి , బహుభాషా కోవిదుడు , నవోదయ పాఠశాలల ను తీసుకు వచ్చి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మంచి విద్యను అందించి దేశాన్ని అన్ని రంగాలలో పరుగులెత్తించిన మన తెలంగాణ తెలుగు బిడ్డ భారత రత్న శ్రీ పీ వీ నరసింహారావు గారి 104 వ జన్మదిన వేడుకలు R&B గెస్ట్ హౌస్ పివి మార్గ్ (ఆర్ & బి అతిధి గృహం, మామిళ్ళగుడెం) దగ్గర అంగరంగ వైభవంగా జరిగాయి . ఈ కార్యక్రమానికి శ్రీ తుమ్మల యుగంధర్ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముఖ్య అతిధిగా హాజరు అయి ప్రసంగించారు . వారు నడయాడిన నేల మీద మనం పుట్టటం మన అదృష్టం అని చెబుతూ వారు భారత దేశాన్ని అన్ని రంగాలలో పురోగమించటానికి కృషి చేసి
మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టారు అని కొనియాడారు .
ఈ కార్యక్రమాన్ని 45 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు ఖమ్మం సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నాగండ్ల దీపక్ చౌదరి గారు నిర్వహించారు .
సభాధ్యక్షులుగా శ్రీ కోసూరు ప్రసాదు ఖమ్మం జిల్లా నాయకులు వ్యవహరించారు .
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ శ్రీమతి పూనుకొళ్ళు నీరజ మేయర్
శ్రీ హనుమంత రావు మార్కెట్ కమిటీ ఛైర్మెన్. గౌరవ కార్పొరేటర్లు వనం కృష్ణవేణి 45 వ డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ పరిమి అనంత లక్ష్మి కాంగ్రెస్ పివి గారి అభిమానులు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .
దీపక్ చౌదరి నాగాండ్ల
వర్కింగ్ ప్రెసిడెంట్
సిటీ కాంగ్రెస్ కమిటీ ఖమ్మం
మాజి కార్పొరేటర్