భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ప్రభుత్వం నుంచి అందించాలి.

శాలిగౌరారం 21 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీములను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చూస్తుంది.అలాకాకుడాప్రభుత్వమే బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమ పథకాలను అందజేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు 23 న హైదరాబాదులోని లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడికి పిలుపు నివ్వడం జరిగింది.ఈ సందర్భంగా మామిడి రమేష్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు నిజమా బోర్డు ద్వారా అమలు చేస్తున్న పథకాలైన1,ప్రమాద మరణం2,సహజ మరణం 3,శాశ్వతంగా వైకల్యం4, పాక్సికంగా అంగవైకల్యం ఈ నాలుగు సంక్షేమ పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పగించి తమ బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తుందని ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకొని కార్మికులకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి నిధులు దారి మల్లకుండా కార్మిక సంక్షేమం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.లేకుంటే కార్మిక సంఘాల ఐక్యవేదిక ద్వారా కార్మికులందరినీ ఐక్యం చేసుకొని పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ముట్టడి కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.