భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ...యల్క సోమయ్య గౌడ్
మునగాల 10 జూన్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
*వెల్ఫేర్ బోర్డు కార్డుల అప్డేట్ అసిస్టెంట్ లేబర్ అధికారులకు లాగిన్ ఇవ్వాలి.*
*అనర్హులకు ఇచ్చిన వెల్ఫేర్ బోర్డు కార్డులను తక్షణమే తొలగించాలి.*
*దళారీ వ్యవస్థను నిర్మూలించాలి: యల్క సోమయ్య గౌడ్.*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2009 నుండి కార్డులు పొందిన కార్మికులకు ఆధార్ అప్డేట్ లేదని అప్డేట్ కొరకు హైదరాబాద్ వెళ్లాలని లేబర్ అధికారులు తెలియజేయడంతో చేసేది ఏమీ లేక కొంతమంది బోర్డు కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు మరి కొందరు హైదరాబాద్ వెళ్లలేక వచ్చే సంక్షేమ పథకాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారు, కనుక ఆధార్ అప్డేట్ లాగిన్ స్థానిక అసిస్టెంట్ లేబర్ అధికారులకు లాగిన్ ఇవ్వాలని, జిల్లాలో దళారులు విచ్చలవిడిగా నిర్మాణ రంగానికి సంబంధంలేని అనర్హులను బోర్డులో చేర్చి తద్వారా సంక్షేమ పథకాలను ఇప్పించటంతో సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయి తక్షణమే దళారుల వ్యవస్థను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పెండింగ్ లో ఉన్న క్లైములను తక్షణమే పరిష్కారం అయ్యేలాగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు,మండల కన్వీనర్ బచ్చలకూర స్వరాజ్యం మండల అధ్యక్షులు షేక్ దస్తగిరి ప్రధాన కార్యదర్శి మామిడి నాగేంద్రబాబు పట్టణ అధ్యక్షులు అల్లి నాగరాజు ఉపాధ్యక్షులు కోల ఆంజనేయులు ఎస్కే సైదా ఎం జాన్ పాషా కనకయ్య సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.