భద్రాద్రి రామాలయంలో అత్యంత ప్రాధాన్యమైన వశిష్ట సమానమైన ప్రధాన పురోహితుని నియామకం వెంటనే చేయండి.
భద్రాద్రి రామాలయంలో అత్యంత ప్రాధాన్యమైన వశిష్ట సమానమైన ఆస్థాన (ప్రధాన పురోహితుని) పండితుని నియామకం వెంటనే చేయండి.
రామాలయ అభివృద్ధి పనులు పూర్తిచేసి మిగిలిన మత ఉద్యోగులను ఎంపిక చేయండి.
భద్రాద్రి 12 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– గతంలో కూడా సుమారు 10 మంది కి పైగా మత ఉద్యోగులు అనగా వేద పండితులు, సహాయ అర్చకులను నియమించడం జరిగింది. అప్పటికే సుమారు 3 ఏళ్లకు పైగా ఖాళీగా ఉన్న ప్రధాన ఆస్థాన పురోహితుని నియమించకపోవడం తోనే దీని వెనుకకొందరి కుట్ర ఉన్నట్లు తెలియవచ్చిందని గాయత్రి బ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావజ్జల. రవికుమార్ పేర్కొన్నారు.
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో భక్త రామదాసు కాలం నుండి వశిష్ట సమానమైన ప్రధాన పురోహితుని పోస్టుకు వైదిక బ్రాహ్మణ సమాజం నుండి నియమించు కోవడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ఒకరిద్దరు వైదిక ద్రోహులు వైదిక బ్రాహ్మణ సమాజంపై కుట్రలు చేస్తూ ఆస్థాన ప్రధానపురోహితుని పోస్ట్ నియామకం జరగకుండా ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారని రామా వజ్జల తెలిపారు. గత పుష్కర కాలం పైగా అసత్య గోత్ర ప్రవరలు వల్లిస్తూ సీతారాముల కళ్యాణంలో సైతం శ్రీరామచంద్రుని పేరు చెప్పడం ఇష్టం లేని కొందరు దైవ ద్రోహులు మహా ఇల్లాలు సీతాదేవికి భర్తగా ఏక పత్నీ వ్రతుడైన శ్రీరామచంద్రుని పేరు చెప్పకుండా బహుభార్యలు గల నారాయణుని భర్తగా చెప్తూ సీతారాములకు తీవ్ర అపచారం చేస్తున్నారని, ఈ అపచారం ఎల్లకాలం కొనసాగించాలంటే సమర్ధుడైన వైదిక బ్రాహ్మణ అభ్యర్థి ప్రధాన పురోహితునిగా వచ్చినట్లయితే తమ పప్పులు ఉడకవని ఇబ్బంది పడుతున్న దైవ ద్రోహులు తమ బాంచను పురోహితునిగా నియమించుకోవడానికి అనేక కుట్రలు పన్నుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమర్థుడైన వైదిక బ్రాహ్మణ పండితుని ప్రధాన పురోహితునిగా నియమించి నిజమైన గోత్ర ప్రవరాలతో సీతారాముల కళ్యాణం, నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారుచర్యలు తీసుకొని సమర్థుడైన ప్రధాన పురోహితుని వైదిక బ్రాహ్మణ సమాజం నుండి వెంటనే నియమించి, దేవాలయ అభివృద్ధి అనంతరం మిగిలిన మత సిబ్బందిని నియమించాలని రామా వజ్జల. రవి కుమార్ సీఎం గారికి విజ్ఞప్తి చేశారు.
రామాలయంలో జరుగుతున్న కుట్రలపై దృష్టి సా రి0చాలని దేవాదాయ మంత్రి శ్రీమతి కొండా సురేఖ కి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది. రామాలయం అభివృద్ధి పనులలో భాగంగా గర్భగుడి చుట్టూ ఉన్న చుట్టు గుడులను, లక్ష్మీ తయారు గుడిని తొలగించి అక్కడి దేవతమూర్తులను తగు ప్రదేశాలలో భద్రపరచినఈ సమయంలో జూన్ 13వ తేదీ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మత సిబ్బంది పరీక్షలను వాయిదా వేసి రామా లయ నిర్మాణం అయిన వెంటనే నియమించుకోవడం ఉభయ శ్రేయస్కరంగా ఉంటుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.