ప్రభుత్వ దవఖానలో సిబ్బందిని నియమించాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
అడ్డగూడూరు 11 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిప్యూటీ కలెక్టర్‌కు మండల సిపిఐ కార్యదర్శి బుర్ర అనిల్ కుమార్ వినతిపత్రం అందజేశారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు,నర్సులు,ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఇతర సిబ్బంది ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ..డిప్యూటీ కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలపైనే ఆధారపడుతున్నందున ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి వైద్య సేవలను మెరుగుపరచాలని కోరారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్య హక్కును కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని,అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్,సీపీఎం మండల కమిటీ సభ్యులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు,విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు డప్పు గోపి,బీఆర్ స్ మండల నాయకులు చిప్పలపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.