నాయిబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం

Jun 12, 2026 - 01:07
Jun 12, 2026 - 01:12
 0  0
నాయిబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం

అడ్డగూడూరు 11 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని నాయిబ్రహ్మ సేవా సంఘం గురువారం రోజున ముఖ్యుల సమావేశంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో నాయిబ్రాహ్మణ కార్పొరేషన్‌కు చోటు కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని యాదాద్రి భువనగిరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనేకసార్లు వినతిపత్రాల ద్వారా ప్రభుత్వం దృష్టికి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో,సభల్లో నాయి బ్రాహ్మణ వృత్తిని ముఖ్యమంత్రి గొప్పగా కొనియాడినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ వర్గంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.నిజంగా నాయి బ్రాహ్మణుల పట్ల ప్రేమ, శ్రద్ధ ఉంటే వెంటనే ప్రత్యేక నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి,ఆ కార్పొరేషన్‌కు నాయి బ్రాహ్మణ వర్గానికే చెందిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి,ఆ నిధులు నేరుగా నాయి బ్రాహ్మణ కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ప్రమేయం లేకుండా కార్పొరేషన్ ద్వారా పేద నాయి బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలని, వృత్తి ఆధారిత సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.డిమాండ్సనాయి బ్రాహ్మణులు ఉచిత కరెంటు పెండింగ్లో ఉన్న బిల్లు ప్రభుత్వం చెల్లించాలి కరెంటులు వేధింపులు ఆపాలి. నాయి బ్రాహ్మణులకు మోడల్ సెలూన్లుఏర్పాటు చేయాలి.50 సంవత్సరాలు నిండిన నాయి బ్రాహ్మణులకు పెన్షన్ ఇవ్వాలి. నాయి బ్రాహ్మణులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వాలి.దేవస్థానంలో కళ్యాణ కట్టల్లో పని చేసే నాయి బ్రాహ్మణులను పర్మినెంట్ చేయాలి.  మహిళలకు బ్యూటీ పార్లర్ శిక్షణ ఇచ్చి వారికి షాపులు ఏర్పాటు చేయాలి హాస్పటల్లో పోలీస్ శాఖలో బార్బర్ పోస్టులను భర్తీ చేయాలి. ఈ కార్యక్రమంలో నాయిబ్రహ్మ సేవా సంఘం అడ్డగూడూరు మండల కార్యదర్శి పయ్యావుల మచ్చగిరి, పయ్యావుల అంజయ్య, ఏపూరి రాములు, మల్లేశం, రమేష్, బుగ్గ రాములు, తదితరులు పాల్గొన్నారు.