భగవాన్ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

Sep 25, 2026 - 19:41
 0  1
భగవాన్ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
భగవాన్ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

 బాసు శ్యామల హనుమంతు నాయుడు _

 జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో పెద్ద చింతరేవుల అన్నప్రసాద ట్రస్ట్ సత్రంలో చాతుర్మాస దీక్షల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీపాదులు వారు,విద్యారాజేశ్వర తీర్థ శ్రీపాదులు వారిచే నిర్వహించిన భగవాన్ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం కార్యక్రమంలో పాల్గొని, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం మరియు మూల రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు....  అనంతరం, _ బాసు శ్యామల హనుమంతు నాయుడు ని పీఠాధిపతులు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించి,శాలువతో సత్కరించి,ఆశీర్వదించారు....._ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీపాదులు వారు,విద్యారాజేశ్వర తీర్థ శ్రీపాదులు వారిచే చాతుర్మాస దీక్షల నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది అని అన్నారు....  శ్రీ ఆంజనేయస్వామి మరియు ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతుల ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ....ఈ కార్యక్రమంలో అల్లపాడు ప్రతాప్, చక్రీధర్ రెడ్డి,లక్ష్మీకాంత్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,తిమ్మప్ప గౌడ్,జాంపల్లి భరత్ సింహారెడ్డి,ముని రెడ్డి,డ్యామ్ శ్రీను,చంద్రశేఖర్,మణివర్ధన్ రెడ్డి, వెంకటేష్ యాదవ్,అంజి,మాలిక్,గంగాధర్,అరవిందు,సవరన్న,మరియు నాయకులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333