డీసీఎం అదుపుతప్పి ఫల్టీ. .డ్రైవర్ కు గాయాలు
అడ్డగూడూరు 22 ఏప్రిల్ 226 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రగూడూరు గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో తిరుమలగిరి నుండి వెలిగొండ వైపు వెళ్తున్న డీసీఎం నెంబర్ ఏపీ28 టి డి 5818 నెంబర్ గల వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.డ్రైవర్ రావుల గంగరాజు తండ్రి కొమురయ్యకు తీవ్ర గాయాలు జరగడంతో స్థానికుల తెలిపిన సమాచారం అందుకున్న అడ్డగూడూరు పోలీసులు వెంటనే స్పందించి డ్రైవర్ ని 108 అంబులెన్స్ లో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.