విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాల డాక్టర్ రాధిక మరియు సూపర్వైజర్స్ ఎర్రవల్లి ఏఎన్ఎమ్స్ , ఆశా కార్యకర్తలు అందరూ కలిసి ఎర్రవల్లి లోని ఐజ గురుకుల స్కూల్ ను సందర్శించి (TGSWRS JC BOYS ) 50 మంది విద్యార్థులకు ఆరోగ్య పరిక్షలు జరిపి మందులను పంపిణీ చేయడం జరిగింది , మరియు దగ్గు, జలుబు, కడుపు నొప్పి, విరోచనాలు, తలనొప్పి, జ్వరము మొదలగు చిన్నచిన్న ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ఎర్రవల్లి సర్పంచ్ అనిత కృష్ణ సాగర్ చేత ప్రారంభించడం జరిగినది. విద్యార్థులకు దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోదకాలు మరియు వర్షాకాలం వలన వచ్చే విరోచనాలు, వాంతులు, మొదల గు వ్యాధులు, మరియు పరిశుభ్రమైన నీటిని త్రాగవలెన ని డాక్టర్ రాధిక విద్యార్థులకు సూచించారు. మరియు హ్యాండ్ వాష్, వ్యక్తిగత పరిశుభ్రత ను, ఆరోగ్య విద్యను బోధించారు. ఈ కార్యక్రమం వైస్ ప్రిన్సిపాల్ లావణ్య , బాలమురళీకృష్ణ సూపర్వైజర్ మరియు టీచర్స్ తదితరులు ఉన్నారు.