భక్తి శ్రద్ధలతో ఎవరికి ఇబ్బంది కలగకుండా గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి
భక్తి శ్రద్దలతో ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి సీఐ రజితా రెడ్డి కోదాడ రూరల్.
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి.
శాంతి, సామరస్యానికి మనం పాటుపడాలి, సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని సీఐ రజితారెడ్డి తెలిపారు , గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుంది. ఉత్సవాలు భక్తి భావంతో జరుపుకోవాలని ఆమె తెలిపారు ..
● మండపాల వద్ద కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలి.
● ఎలాంటి సంఘటనలు జరిగిన అనుమతి అర్జీదారులు, ఉత్సవకమిటీ సభ్యులే బాధ్యత వహించాలి.
● మడపాల ఏర్పాటుకు నాణ్యమైన సామాగ్రి ఉపయోగించాలి, విద్యుత్ వైర్లు బాగుండాలి.
● మండపాలు రోడ్లపై ఏర్పాటు చేయవద్దు.
● ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు.
● DJ లకు, బాణాసంచా కు అనుమతి లేదు.
● నిబంధనలు పాటించాలి.