పర్యావరణ పరిరక్షణ కోసం బంక మట్టి వినాయకులను పూజించాలి

Sep 7, 2024 - 20:53
 0  1
పర్యావరణ పరిరక్షణ కోసం బంక మట్టి వినాయకులను పూజించాలి

*పర్యావరణ పరిరక్షణ కోసం బంక మట్టి వినాయకులను పూజించాలి*

తెలంగాణ వార్త సూర్యపేట జిల్లా ప్రతినిధి.

*ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మికాంత్*

*కన్నులపండువగా 500 బంకమట్టి వినాయక విగ్రహాలు, జ్యూట్ బ్యాగ్ లు, చేతి సంచులు, గులాబీ మొక్కల పంపిణీ*

 పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి సమతుల్యత కోసం, మంచినీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బంక మట్టి తో తయారు చేసిన వినాయకుని విగ్రహములతోనే వినాయక చవితి పండుగ ను జరుపుకోవాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మికాంత్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా శనివారం నాడు ఉదయం చల్లా బ్రదర్స్ చల్లా లక్ష్మికాంత్ , చల్లా లక్ష్మిప్రసాద్ ల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విటి రోడ్ లో గల భూమిరెడ్డి హాస్పిటల్ సమీపంలో 500 మందికి బంకమట్టి వినాయక విగ్రహాలు, జ్యూట్ బ్యాగ్ లు, చేతి సంచులు, గులాబీ మొక్కలను భక్తులకు అందజేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ కెమికల్స్ తో తయారు చేసిన విగ్రహాలు చెరువులలో నిమజ్జనం చేయడం వలన చెరువులో నీరు కలుషితమై జలచరాలు మృతి చెందుతాయి అని తెలిపారు.కలుషిత నీటిని వాడడం వల్ల ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది అని అన్నారు.గత 10 ఏండ్లుగా వినాయక చవితి పండుగకు బంక మట్టి గణపతి విగ్రహాలను పంపిణి చేసి ప్రోత్సహి స్తున్నట్లు తెలిపారు.ఈ చల్లా శృతి,చల్లా లక్ష్మి ప్రసాద్,అనిత దంపతులు, పబ్లిక్ క్లబ్ సభ్యులు రాచకొండ శ్రీనివాస్, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాచర్ల కమలాకర్, క్యాబినెట్ కోశాధికారికలకోట లక్ష్మయ్య, బెలిదె శ్రీనివాసులు, బిక్కుమళ్ల కృష్ణ, మంచాల శ్రీనివాస్ గుప్త, తల్లాడ సోమయ్య, కర్నాటి సురేందర్, మిట్టపల్లి రమేష్ శ్రీదేవి, వాస నర్సింహరావు, ఓరుగంటి రామ మూర్తి ముప్పారపు నాగేశ్వరరావు, తోట కిరణ్, ముప్పారపు నరేందర్, యాదా కిరణ్, వంగవీటి రమేష్, బైరబోయిన శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పలువురు ఆర్యవైశ్య నాయకులు , పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223