బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయండి మహాప్రభో 

Apr 27, 2024 - 19:57
Apr 27, 2024 - 20:06
 0  62

నీలహళ్లి-పాతపాలెం గ్రామాల మధ్య ఉన్న వాగు బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తి... 

 ప్రయాణికులకు తప్పని తిప్పలు .. 

నిద్రావస్థలో బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టర్..

 నిధులు వస్తే పనిచేస్తానని కాంట్రాక్టర్ సమాధానం..

ఈ విషయంపై త్వరలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం..

- నీలహళ్లి గ్రామస్తులు... 

జోగులాంబ గద్వాల 27 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  మండల పరిధిలోని నీలహళ్లి గ్రామ సమీపంలో ఉన్న వాగు బ్రిడ్జి వంతెన పనులు ముందుకు సాగడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వాగు బ్రిడ్జి నిర్మాణం పనులను నీలహల్లి గ్రామ ప్రజలు పరిశీలించారు. కాంట్రాక్టర్ ని చరవాణి ద్వారా వివరణ అడుగగా ఇప్పటికే చేసిన పనులకు నిధులు మంజూరు కాలేదని నిధులు ఆలస్యం అవుతుండడంతో పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్ పొంతన లేని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. ఏది ఏమైనా వచ్చే వర్షాకాలం నాటికి వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోతే రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం మరియు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం పనులు ముందుకు సాగే విధంగా చర్యలు చేపట్టాలని నీలహల్లి గ్రామ ప్రజలు కోరారు. 


ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చిలుక మునేప్ప ,కృష్ణమూర్తి ,విజయేంద్ర, రఫీ,నాగరాజు, ఆంజనేయులు, పాండు, సాయిబాబు, బుల్ల వీరన్న, మేకల కర్రెప్ప,లైట్ సాయన్న, గురు వీరన్న,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333