బోనాల పండుగ వేడుకలు...

Aug 10, 2026 - 01:12
Aug 10, 2026 - 01:14
 0  3
బోనాల పండుగ వేడుకలు...
బోనాల పండుగ వేడుకలు...

బోనం ఎత్తుకున్న చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు 

కోరుట్ల 10 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- కోరుట్ల పట్టణ బాలాజీ రోడ్లో గల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు  జువ్వాడి కృష్ణారావు లు విచ్చేసి బోనం ఎత్తుకొని పట్టణ పురవీధుల గుండా తప్పు తప్పులు పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆ అమ్మవారి కృపాకటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కృషి పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొంతం రాజం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి కౌన్సిలర్ చిట్యాల లక్ష్మీనారాయణ నాయకులు కడకుంట్ల గంగాధర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333