బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాలను త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్ కు గ్రామ  సర్పంచ్ విజ్ఞప్తి.

Aug 21, 2026 - 17:58
 0  2
బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాలను త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్ కు గ్రామ  సర్పంచ్ విజ్ఞప్తి.
బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాలను త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్ కు గ్రామ  సర్పంచ్ విజ్ఞప్తి.

జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల కేంద్రంలోని బిసి  కాలనీలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవన పనులను త్వరగా పూర్తి చేయాలని ధరూర్ గ్రామ సర్పంచ్ డీ ఆర్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్  ని కోరారు.శుక్రవారం ధరూర్ మండలంలో పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ని కలిసిన సర్పంచ్, కాలనీలో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాల భవనం అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333