బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ
జోగులాంబ గద్వాల 25 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మండలం. బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని గురువారం తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో పురందరు కుమార్ అర్చకులు సందీప్ పూర్ణకుంభ స్వాగతం పలికి దేవాలయంలో గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ విశిష్టత గురించి ఈవో వారికి వివరించారు. వారితోపాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.