బీచుపల్లి ఆయిల్ మిల్లులో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఫ్యాక్టరీ లేఅవుట్ పరిశీలన
త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రాసెసింగ్ యూనిట్ పనులు ప్రారంభం
జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజ్‌కుమార్
జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 23 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. మండలం బీచుపల్లిలోని ఆయిల్ మిల్లులో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ఫ్యాక్టరీ లేఅవుట్‌ను ఖరారు చేసేందుకు టీజీ ఆయిల్‌ఫెడ్, హైదరాబాద్‌కు చెందిన సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు.
బుధవారం బీచుపల్లి ఆయిల్ మిల్లును టీజీ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన టి. సుధాకర్ రెడ్డి, జే. సత్యనారాయణ మేనేజర్ మార్కెటింగ్, శ్రీకాంత్ రెడ్డి మేనేజర్ ప్లాంట్స్ అండ్ ప్రాజెక్ట్స్,ఆకుల బాలకృష్ణ మేనేజర్ టెక్నికల్ తదితరులతో కూడిన సాంకేతిక బృందం పూర్తిగా పరిశీలించినట్లు రాజ్‌కుమార్ తెలిపారు.
ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, యంత్రాల ఏర్పాటు, ఉత్పత్తి ప్రక్రియకు అనుగుణంగా ఫ్యాక్టరీలోని వివిధ విభాగాలను సాంకేతిక బృందం పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా సీడ్ హౌస్‌లో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన నమూనా లేఅవుట్‌ను ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.ఖరారు చేసిన లేఅవుట్‌కు అనుగుణంగా తదుపరి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సాంకేతిక బృందం తెలిపిందని రాజ్‌కుమార్ వెల్లడించారు. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని సాంకేతిక బృందం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి రావడం ద్వారా జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు రైతులకు గెలల సేకరణ, తూకం, రవాణా మరియు ప్రాసెసింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని రాజ్‌కుమార్ తెలిపారు.
అనంతరం అయిజ మండలం వెంకటాపురం స్టేజి వద్ద ఏర్పాటు చేయనున్న ఆయిల్‌పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని సాంకేతిక బృందం పరిశీలించినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజ్‌కుమార్ తెలిపారు. కేంద్రంలో వెయ్‌బ్రిడ్జి, రైతు సేవా కేంద్రం తదితర సౌకర్యాల ఏర్పాటుకు నిధులు, అనుమతులు మంజూరైనట్లు పేర్కొన్నారు. రైతులకు సులభతరంగా గెలల సేకరణ, తూకం, రవాణా సౌకర్యాలు కల్పించేలా పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నరేష్ సివిల్ ఇంజనీర్, టీజీ ఆయిల్‌ఫెడ్, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.