బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్...

మహేశ్వర్ రెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలు సత్యదూరం..
కాంగ్రెస్ పార్టీలో చేరుతా మంత్రి పదవి ఇవ్వమని మహేశ్వర్ రెడ్డి అడిగాడు..
గాలిమాటల మహేశ్వర్ రెడ్డి..రాజకీయాల్లో జెండాలు మార్చి నాపై విమర్శలు చేస్తుండు..
మహేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నడు..
ఈ దేశంలో చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ..
నేనేదో నా సొంత ఇమేజ్ తో గెలిచిన..బీజేపీ నుంచి నాకొచ్చిన ఫయిదా ఏంలేదని చెప్పిండు..
కాంగ్రెస్ లో ఉంటే ఇయ్యాల మంత్రిని అయ్యేవాన్నని దిగులుపడ్డడు..
అట్లాంటి వ్యక్తి నన్ను షిండే అన్నడంటే నాకే విచిత్రం అయితుంది..
నేను షిండేను అవునో కాదు భగవంతునికి ఎరుక..
మహేశ్వర్ రెడ్డి మాత్రం కిషన్ రెడ్డికి,ఈటెల రాజేందర్ కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనర్ధన్ రెడ్డి..
అవకాశం ఇస్తే..రాత్రికి రాత్రే పార్టీ మారుతనని బతిమాలిండు..
కాంగ్రెస్ లో ఎవ్వరు సప్పుడు చెయ్యకపోయేసరికి నాపై కామెంట్లు చేస్తున్నడు...
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనక పెద్ద కుట్ర ఉంది...
కాంగ్రెస్ లో పుట్టిన.. కాంగ్రెస్ జెండాతోనే పోతా..
కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి...