బాల్య వివాహాల పై అవగాహన సదస్సు

May 26, 2026 - 22:38
 0  4
బాల్య వివాహాల పై అవగాహన సదస్సు

తిరుమలగిరి 27 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

కిశోర బాలికలకు బాల్యవివాహం నిరోధక చట్టం పై అవగాహన  

తిరుమలగిరి మండల పరిధిలోని పట్టణ మున్సిపాలిటీ లొ అంగన్వాడి సెంటర్ లో మరియు తాటిపాముల, & జలాలుపురం, రాఘవపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళ శిశు సంక్షేమ శాఖ సూర్యపేట జిల్లా వారు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు విద్యార్థులకు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం గ్రామ సర్పంచ్..అధ్యక్షతన నిర్వహించారు .ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఐసిడిఎస్ తిరుమలగిరి సెక్టార్ సూపర్వైజర్ కందుకూరి. మంగ మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం 18 సంవత్సరం లోపు బాలికలకు 21 సంవత్సరం లోపు బాలుడికి వివాహం చేయడం చట్టరీత్య నేరం అని. అవగహన కలిపించారు. బాల్యవివాహం జరిపించిన లేదా పాల్గొన్న ఏ వయక్తికైనా రెండుసంవత్సరాల కారాగారా శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా ఉంటుంది తెలిపారు.

 ప్రతి విద్యార్థి సురక్షితంగా మరియు గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉంటారని తెలిపారు. బాలలపై జరిగే వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి సమస్యలు చట్టపరంగా నేరాలని చెప్పారు మరియు చిన్న పిల్లలకు వివాహం చేయడం వల్ల తొందరగా గర్భ ధారణ వల్ల కలిగే అనార్ధల గురించి అవగాహన కల్పించారు.అలాగే, ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని, సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో మాట్లాడకూడదని విద్యార్థులకు తెలియజేశారు. సందేహాస్పద పరిస్థితులు ఎదురైతే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు కాల్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సెక్టార్ సూపర్వైజర్ Md. కైరున్నిస్సా మాట్లాడుతూ 

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో బాలల హక్కులపై అవగాహన పెరిగి, తమను తాము రక్షించుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులు DCPU కౌన్సిలర్ శోభారాణి ,అంగన్వాడీ టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి