బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం:జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు

Feb 1, 2025 - 19:42
 0  8
బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం:జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు
బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం:జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు

జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: జిల్లా కేంద్రంలో ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అధ్యక్షతన మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో ప్రోగ్రాం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ, బాలికల సంరక్షణకు సంబంధించిన శాఖలు కలిసి పనిచేయాలని అన్నారు బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం అనే అంశంపై గ్రామస్థాయి అధికారులకు అవగాహన కల్పించాలని దాని ద్వారా ప్రజలకి ఈ కార్యక్రమం విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు, అలాగే సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ఎక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న తెలిస్తే నర్సింగ్ హోమ్ హాస్పిటల్స్ పైన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు .బాలికల విద్య ప్రోత్సహించడానికి ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

    ఈ కార్యక్రమంలో  జిల్లా సంక్షేమ అధికారి సునంద, ఎస్సీ సంక్షేమం అధికారి సరోజ, బీసీ సంక్షేమం అధికారి రమేష్ బాబు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి హృదయ రాజు, జిల్లా బాలల సంరక్షణ అధికారి నరసింహ,మహిళా సాధికారతకు జిల్లా కేంద్రం జిల్లా సమన్వయకర్త జ్యోస్త్నా, మనపాడు ప్రాజెక్టు సిడిపిఓ సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333