బహుమతులు అంటూ లక్కీ డ్రాల నిర్వహణకు అనుమతులు లేవు.

Jun 4, 2026 - 15:41
Jun 4, 2026 - 15:43
 0  2
బహుమతులు అంటూ లక్కీ డ్రాల నిర్వహణకు అనుమతులు లేవు.

ఇది సామాజిక పరమైన ఆర్థిక మోసం, నేరం.

ఎవరైనా లక్కీ డ్రాల పేరుతో చట్ట విరుద్ధంగా ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.

షీట్స్ నమోదు చేసి, పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపుతాం.

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ.

సూర్యాపేట 4 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు లాంటి స్థిరాస్తులు, ఇతర వస్తువులు బహుమతిగా గెలుచుకోండి అంటూ పరిమిత టోకెన్స్ కలవు అని ప్రజలకు అత్యాశ చూపి లక్కీ డ్రాల పేరిట డబ్బులు వసూలు చేస్తే అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రకటన జారీ చేస్తూ మాట్లాడారు. వ్యవసాయ భూమి, ఖాళీ ఇంటి స్థలాలకు లక్కీ డ్రా నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవు ఇది చట్ట విరుద్ధమైన చర్య, ఆర్థిక నేరం అని అన్నారు, పరిమిత టోకెన్స్ కలవు అంటూ ప్రజలకు అత్యాశ చూపి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, షీట్స్ నమోదు చేయడం పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపడం లాంటి చర్యలు తీసుకుంటాం అని ఎస్పీ హెచ్చరించారు. కొద్ది డబ్బుతో ఎక్కువ లాభం ప్లాటు, భూమి, ఇతర విలువైన బహుమతులు గెలుచుకోండి అంటూ వచ్చే ప్రకటనలను ప్రజలు నమ్మవద్దు, లక్కీ డ్రా లలో డబ్బులు కట్టవద్దు అని కోరారు, ఇది ఒక సామాజిక పరమైన ఆర్థిక మోసం, నేరం అని తెలిపినారు. 

ఇలాంటి వాటిపై పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి, పోలీసు శాఖ నిఘా ఉంచింది అని తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీసు స్టేషన్ల నందు పిర్యాదు చేయవచ్చు అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333