ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

Jun 4, 2026 - 05:25
Jun 4, 2026 - 18:39
 0  2
ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

సర్పంచ్ బోదెబోయిన భరత్ కుమార్

వాజేడు తెలంగాణ వార్త : వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ లో  గుమ్మడి దొడ్డి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదామని సర్పంచ్ బోదెబోయిన భరత్ కుమార్ అన్నారు. బుధవారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పలు కిరాణా దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వాడ కానికి దూరంగా ఉండాలని అందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ గ్లాసులు, క్యారీ బ్యాగులను వస్తువులను సిబ్బందితో సేకరించారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్