ఫిట్నెస్ లేని  ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి

Jun 11, 2024 - 20:10
 0  2

జోగులాంబ గద్వాల జిల్లా RTO అధికారికి వినతి .

TNSF - రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్ PDSU-రాష్ట్ర సహాయ కార్యదర్శి హలీంపాషా,USFI జిల్లా కార్యదర్శి రంగస్వామి,

జోగులాంబ గద్వాల 11 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయొద్దని వారన్నారు  ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం మే 15లోగా స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ చేయించాల్సి ఉండగా స్కూల్స్ యాజమాన్యం  గడువు దాటినప్పటికి  పూర్తిస్థాయిలో బస్సులకు సామర్థ్య ఫిట్నెస్ పరీక్షలు  చేయించని పరిస్థితి నేడు జిల్లాలో కనిపిస్తుందని అన్నారు. కావున ఫిట్నెస్ లేని బస్సు లకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జరిచేయవద్దని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  జిల్లా RTO అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది...  స్కూల్ బస్ లలో ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, మిడిల్ రాడ్స్, విండోస్ దగ్గర సైడులకు జాలి లేకుండానే పాత బస్ లకు కొత్త రంగులు అద్ది ఫిట్నెస్ తేవడం కోసం విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థి, తల్లితండ్రులను, అధికారులను మభ్యపెడుతున్నారాని వారి పై వారు ఆవేదన వ్యక్తం చేశారు...  జిల్లా వ్యాప్తంగా ఫిట్ నెస్ లేని బస్సుల్లో సీట్ల పరిమితి మించి రోజూ వందల మంది విద్యార్థులను తరలిస్తు విద్యార్థుల జీవితలతో  చెలగాటం ఆడుతున్నారు అని వారన్నారు, చాలీచాలని జీతాలు ఇస్తూ లైసెన్సులు లేని డ్రైవర్లను నియమించి విద్యార్థులను ఎక్కించడానికి దింపడానికి క్లీనర్స్లను నియమించకుండా  ప్రైవేట్ స్కూల్ ల బస్సులతో ఎంతోమంది విద్యార్థులు  ప్రాణాలు పోయాయని  ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యం పై వారి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కొన్ని బడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం  ఫిట్నెస్ లేని  స్కూల్ బస్సుల నడుపుతూ విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి కిలోమీటర్ల పేరుతో 30వేల నుండి 50వేల రూపాయల వరకు ఫీజులు వసూళ్లకు పాల్పడుతున్నా కూడా జిల్లా విద్యా శాఖ మరియు రవాణా శాఖ అధికారులు పట్టించు కోవడం లేదని అధికారులపై  వారు అన్నారు. తక్షణమే ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్స్ బస్సులను సీజ్ చేసి స్కూల్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో TNSF- రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్,పవన్,PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి హలీంపాషా,USFI జిల్లా అధ్యక్షులు రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333