ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు*కు వరద ఉధృతి.
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి భారీగా వరద.
జురాలకు 2.41 లక్షల క్యూసెక్కుల భారీ వరద - 33 గేట్లు ఎత్తి 2.21 లక్షల విడుదల.
జోగులాంబ గద్వాల 3 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
ధరూర్.
:మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు కు వరద ప్రవాహం మహారాష్ట్ర, కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో *ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు*కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో జూరాలకు ఇన్‌ఫ్లో ఒక్కసారిగా పెరిగింది.ప్రాజెక్టు అధికారులు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం:ప్రస్తుత నీటి పరిస్థితి:
నీటిమట్టం 317.53 మీటర్లు
పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు
ప్రస్తుత మొత్తం నిల్వ 7.701 టీఎంసీలు
ప్రత్యక్ష నిల్వ*: 3.994 టీఎంసీలు వరద వివరాలు
మొత్తం ఇన్‌ఫ్లో 2,41,000 క్యూసెక్కులు
మొత్తం అవుట్‌ఫ్లో 2,53,102 క్యూసెక్కులు
వరదను దిగువకు పంపేందుకు అధికారులు 33 క్రస్టు గేట్లు ఎత్తి 2,21,331 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు.
విద్యుదుత్పత్తి 6 యూనిట్లలో 26,817 క్యూసెక్కుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
ఇన్‌ఫ్లో 2.30 లక్షలు ఉండగా, సాయంత్రానికి 2.41 లక్షలకు చేరింది. గేట్ల సంఖ్య కూడా 30 నుండి 33 కి పెరిగింది. ఇన్‌ఫ్లో కంటే అవుట్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది.
అధికారుల హెచ్చరిక
వరద ఉధృతి దృష్ట్యా జూరాల, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కృష్ణా నది దిగువ ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నది ఒడ్డున ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలు తమ విలువైన వస్తువులతో సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రాజెక్టు వద్ద 24 గంటల పాటు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు.