ప్రాథమిక కోన్నత  పాఠశాలలో ఘనంగా దసరా,బతుకమ్మ వేడుకలు

Oct 1, 2024 - 19:29
 0  9
ప్రాథమిక కోన్నత  పాఠశాలలో ఘనంగా దసరా,బతుకమ్మ వేడుకలు
ప్రాథమిక కోన్నత  పాఠశాలలో ఘనంగా దసరా,బతుకమ్మ వేడుకలు

- ఆటపాటలతో ఆకట్టుకున్న విద్యార్థులు..

- చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుందని దసరా మనకు బోధిస్తుంది...

* *ప్రాథమిక కొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు .

 జోగులాంబ గద్వాల 1 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  గట్టు. మండలం అంతంపల్లి గ్రామం పరిధిలోని ప్రాథమిక కోన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు *ఆధ్వర్యంలో *దసరా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలతో ఆడి పాడారు. ఆటపాటలతో విద్యార్థినిలు ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ...

విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ముందస్తు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు...చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుందని దసరా మనకు బోధిస్తుంది అని అన్నారు. ఇది మనకు సత్యం మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది అని అన్నారు. ఇంకా, ఇది సొరంగం చివరిలో కాంతిపై మనకు నమ్మకం కలిగిస్తుంది.భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు దసరాను విభిన్నంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో,వారు రాక్షసుడు రావణుడు మరియు అతని సోదరుల విగ్రహాలను తయారు చేస్తారు అని తెలిపారు. అప్పుడు వారు దానిని పేలుడు పదార్థాలతో నింపి బాణంతో కాల్చివేస్తారు,దీని ఫలితంగా అద్భుతమైన బాణాసంచా వస్తుంది అని తెలిపారు.
అలాగే, 
      విద్యార్థులు దసరా సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రధానోపాధ్యాయులు తెలిపారు...విద్యార్థులు పండుగ సమయంలో తల్లిదండ్రులతో కలిసి,వేరే వేరే గ్రామాలకి వెళ్లాలని వారు సూచించారు...

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు ఉపాధ్యాయులు అశోక్, పరుశురాం,ప్రభాకర్ ఎంవిఎఫ్ వాలంటీర్ దానయ్య విద్యార్ధుల బృందం తదితరులు పాల్గొన్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333