ప్రాథమిక ఆరోగ్య సెంటర్ ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ, పి. చంద్రశేఖర్
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఆత్మకూర్ మండల కేంద్రములో డిఎంహెచ్ఓ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు ఆకస్మికంగా ప్రాథమిక ఆరోగ్య సెంటర్ ను తనిఖీ చేయడం జరిగినది ఇందులో భాగంగా నిన్న జరిగిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం గూర్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు మరియులో ప్రాథమిక ఆరోగ్య సెంటర్ లో ప్రసవాలు జరగకపోవడం కారణాలు అడిగి తెలుసుకున్నారు తప్పనిసరిగాphc నందు ప్రసవాలు జరగవలసినదిగా డాక్టర్ మౌనిక మేడం ఆదేశించడం జరిగింది మరియు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు చేరేలా CHO మరియు హెల్త్ సూపర్వైజర్ స్టాఫ్ కు ఆదేశాలు జారీ చేసినారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది. మరియు లేబర్ రూమ్ ఇన్ వార్డ్ వాక్సినేషన్ స్టోర్ ను పరిశీలించారు 0Pలో జరుగు సేవల గురించి క్షుణంగా పరిశీలించి డాక్టర్ మౌనిక గారికి అన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధులపై రోజువారి ఆశా నిర్వహించే ఫీవర్ సర్వే గురించి మరి గుర్తించిన కేసుల గురించి మరియు ఎక్కడైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చే కేసుల గూర్చి పూర్తిగా విచారించడం జరిగింది. సకాలంలో ఫీవర్ సర్వే జరగవలసిందిగా ప్రతి గ్రామంలో ఉన్న గుర్తించిన ఫీవర్ కేసులను గుర్తించి వారికి సరైన సమయంలో చికిత్స అందించవలసిందిగా కోరినారు వారి వెంట వైద్య దికరిని. డాక్టర్ మౌనిక CHO. యాదగిరి MPHS భూతరాజు సైదులు మాణిక్యమ్మ ఫార్మాసిస్ట్ జానకమ్మ జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాబు సిబ్బంది పాల్గొన్నారు