ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-II పరీక్షలు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పట్టిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు
జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్
జోగులాంబ గద్వాల 16 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాలరెండు రోజుల పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ -II పరీక్షల ను జిల్లాలో 25 పరీక్ష కేంద్రాల లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి అని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలియజేసారు. రెండవ రోజు గ్రూప్ -ll పరీక్షల సందర్బంగా జిల్లా ఎస్పీ ఈ రోజు జిల్లా కేంద్రం లోని MALD కళాశాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తద్వార రెందవ రోజు కూడా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి అని అన్నారు. జిల్లా లోని 25 పరీక్ష కేంద్రాల్లో 8722 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, మొదటి రోజు ఆదివారం రెండు సెషన్లలో పరీక్షకు 49.48 శాతం మంది హాజరయ్యారు మరియు రెండవ రోజు సోమవారం రెండు సెషన్లలో 48.06 శాతంమంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.ఈ పరీక్ష సజావుగా సాగేందుకు అభ్యర్థులు కూడా చక్కగా సహకరించారని అన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా చూసిన నోడల్ ఆఫీసర్, జిల్లా అదనపు ఎస్పీ, డి.ఎస్.పి, సిఐలు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు