బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ టీ శ్రీనివాసరావు
జోగులాంబ గద్వాల 21 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా నూతన ఎస్పీగా టీ శ్రీనివాసరావు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఇట్టి కార్యక్రమం లో ముందుగా నూతన ఎస్పీ కు జిల్లా డి . ఎస్పీ లు సత్యనారాయణ, నరేందర్ రావు పుష్ప గుచ్చలు అందించి స్వాగతం పలికారు .అనంతరం ఎస్పీ కి ఏఆర్ పోలీస్ అధికారులు గౌరవ వందనం ఇవ్వడం చేసారు.2007 బ్యాచ్ గ్రూప్ -1 అధికారిగా నియమితులై పాడేరు, జనగామ లలో డి.ఎస్పీ గా విధులు నిర్వహించారు. నందిగామ- కృష్ణ జిల్లా, కొత్తగూడెం లలో ఓ ఎస్ డి గా విధులు నిర్వహించారు. అదనపు ఎస్పీ గా ప్రమోషన్ పొంది స్టేట్ ఇంటల్లిజెన్సీ విభాగం లో విధులు నిర్వహిస్తూనే ఎస్పీ గా ప్రమోషన్ పొందారు. ఎస్పీ గా స్టేట్ ఇంటల్లిజెన్సీ విభాగం లో , గవర్నర్ దగ్గర ఏ డి సి గా విధులు నిర్వహించారు. అనంతరం 2013 సంవత్సరం లో ఐపీఎస్ గా ప్రమోషన్ పొంది సిఐడి లో, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ గా విధులు నిర్వహించారు. బాలనగర్ లా &ఆర్డర్ డీసీపీ గా విధులు నిర్వహిస్తూ బదిలీ లో భాగంగా జిల్లా ఎస్పీ గా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...జిల్లా ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ, చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, వారి భద్రత, రక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేస్తూ, భరోసా కలిగే విధంగా పోలీసింగ్ ఉంటుందని అయన అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా, చట్ట వ్యతిరేక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అయన పోలీస్ అధికారులను ఆదేశించారు.