ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫారం దిమ్మె
తిరుమలగిరి 20 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 11 వ వార్డు హై స్కూల్ ఎదురుగా గల్లీలో అప్పారావు ఇంటి వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కోసం నిర్మిస్తున్న గద్దె వీది రోడ్డు పక్కన ఉండడం మూలంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రతిరోజు ఈ దారి గుండా స్కూల్ బస్సులు ట్రాక్టర్లు ప్రయాణికుల ఆటోలు వెళ్తుంటాయి మూల మీద రోడ్డు పక్కనే ఉండడం మూలంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే నిలుపు వేయాలని ప్రజలు కోరుతున్నారు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడితే ఆ ప్రాంత వీధి ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత చేపట్టాలి కానీ విద్యుత్ అధికారులు తమకేమీ అట్టి జీవో మాకు అవసరం లేదని వారి ఇష్టానుసారంగా విద్యుత్తు గద్దెను నిర్మిస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే నిర్మాణం పనులను నిలిపివేసి కొద్ది దూరంలో నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు