ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కొడుకుని ప్రభుత్వ బడిలో చేర్పించింది

తిరుమలగిరి 25 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:-ప్రాధమిక పాఠశాల X రోడ్ వెలిశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న దొంగరి ప్రశాంతి తన కొడుకు ని ప్రాధమిక పాఠశాల తిరుమలగిరి నందు చేర్పించడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుల పట్ల సంపూర్ణ నమ్మకం ఉందని , అన్ని వసతులు ఉన్నాయని నాణ్యమైన విద్య అందిస్తారనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని ప్రశాంతి తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో తల్లిదండ్రులు హరీష్ ప్రశాంతి మండల విద్యాధికారి ఐ.శాంతయ్య , పాఠశాల ప్రధానోపాధ్యాయులు . అశోక్ రెడ్డి ఉపాధ్యాయ బృందం . కవిత , . సత్యనారాయణ రెడ్డి , . వెంకట్రామనర్సయ్య , . సౌమ్యబాయి , . గిరి మరియు . వెంకటయ్య పాల్గొన్నారు.