ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో సూర్యాపేట మహిళలు ముందు ఉండాలి 

Aug 19, 2026 - 21:30
 0  1
ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో సూర్యాపేట మహిళలు ముందు ఉండాలి 
ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో సూర్యాపేట మహిళలు ముందు ఉండాలి 
ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో సూర్యాపేట మహిళలు ముందు ఉండాలి 

గ్రామీణ విద్యార్థులే లక్ష్యంగా కొత్త ప్రోగ్రామ్స్

యువత, మహిళల ఐడియాలకు వుయ్ హబ్ -

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..

ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో సూర్యాపేట మహిళలు ముందు ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా శక్తి ఉత్సవంలో భాగంగా WE HUB ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూట్ క్యాంప్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
          ముందుగా కలెక్టర్ మహిళలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, పచ్చళ్ళు, జ్యూట్ బ్యాగులను పరిశీలించి అద్భుతంగా ఉన్నాయని అభినందించారు తదుపరి మహిళలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి వస్తువులను తయారు చేసుకొని ఇంటి గడప దాటి ఇక్కడకు వచ్చిన మహిళామణులకు మనస్ఫూర్తిగా  శుభాకాంక్షలు తెలిపారు. మహిళామణులు అన్ని రంగాలలో ముందుండాలని మహిళా సంఘాలకు సూర్యాపేట జిల్లాలో 700 కోట్ల  రుణాలు ఇవ్వడం జరిగినదని, వాటిని ఇంటి ఖర్చులకు, విద్య, వైద్యం మీద ఖర్చు పెట్టకుండా  ఏదో ఒక వ్యాపారం లేదా గ్రూపుగా ఏర్పడి యూనిట్ ఏర్పాటు చేసుకొని  లాభాలు అర్జించుకొని మీ కాళ్ళ మీద మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని, ప్రతి మండలం గ్రామం నుండి ఒక యూనిట్ రావాలని, కష్టపడే తపన మనలో ఉండాలని, మీరు మీ ఇంటి ఆదాయం పెంచుకోవాలని ఆశ, స్ఫూర్తి, తపన ఉంటే దానికి దారి తొలి అడుగు తీసుకోవాలి అంటే WE HUB మీకు అండగా ఉంటుందని,  మహిళలు తమ ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి WE HUB మీకు కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తుందని, మహిళలకు సూర్యాపేటలో మహిళా శక్తి భవనం నిర్మాణం చేపడుతున్నామని  త్వరలో దాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని. మీకు ఇంకేమైనా సందేహాలు సూచనలు ఉంటే సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు 9391609994 నెంబర్ కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని అలాగే ప్రొడక్ట్స్  తయారు చేయు మహిళలకు సంబంధించి వాట్సప్ గ్రూపు, వాట్సప్ ఛానల్ క్రియేట్ చేయవలసినదిగా డిఆర్డిఓ పి డి కి కలెక్టర్ సూచించారు.
        డి ఆర్ డి ఓ పిడి సన్యాసయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారి అందరిని ఒక గ్రూపుగా తీసుకొని  వారిని అత్యున్నత స్థాయికి తీసుకుపోవు లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కావున మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
         తదుపరి  సి ఇ ఓ సీతా పళ్ళచుని మాట్లాడుతూ WE HUB మహిళల కోసం స్థాపించబడిందని చిన్న మార్కెట్ అనుకోకుండా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎలా ప్రొడక్ట్స్ ఎలా మార్కెట్ చేయాలో
ఉపయోగించుకోవాలని, అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలో మీ మీద ఆధారపడి ఉంటుందని  అన్నారు.
         ఈ కార్యక్రమంలో  డి డబ్ల్యు ఓ నరసింహారావు, అడిషనల్ డి ఆర్ డి ఓ పి డి సురేష్, డిపిఎం అరుణ్ కుమార్, ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు స్వయం సహాయక మహిళలు, WE HUB అసోసియేట్ డైరెక్టర్ జహీర్ అక్తర్ షేక్, ఊహ సజ్జ, టీం సభ్యులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333