ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు, ఆక్రమిస్తే కఠిన చర్యలు
పట్టణంలో సుమారు 12 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం,
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, అన్నారు,
మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అనంతరం రోడ్డు, సర్వేనెంబర్ (255) లోనీ సుమారు 12 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఆక్రమించిన భూమిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈరోజు ఉదయం స్వాధీనపరచుకోవడం జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే రెవెన్యూ యాక్ట్ ప్రభుత్వ నిబంధనలు, ద్వారా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు,
ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు, పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ రెవెన్యూ, ల్యాండ్ సర్వే, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్, తదితర శాఖల నుండి భూముల పరిరక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకున్న కార్యక్రమంలో మహబూబాబాద్ తహసిల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.