ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం టైలరింగ్ దరఖాస్తు దారులకు సర్టిఫికెట్లు అందజేత..!
జోగులాంబ గద్వాల 20 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం టైలరింగ్ కింద దరఖాస్తులు చేసుకున్న వారికి ట్రైనింగ్ సెంటర్ లో 7 రోజులు ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి శుక్రవారం SVM డిగ్రీ కాలేజ్ సమీపంలో ఉన్న ట్రైనింగ్ సెంటర్లో జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగ పరచుకోవాలని, ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు రుణ గ్రహితలకు డిజిటల్ ఐడి పీఎం విశ్వకర్మ డిజిటల్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ప్రదాన మంత్రి నరేంద్రమోదీ కింది స్థాయి నుండి వచ్చినటువంటి ప్రధానమంత్రి అట్టడుగున ఉన్న నిరుపేదలు బలోపేతం కావాలని, దేశం అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా పేద ప్రజల అభివృద్ధి చెందాలని, చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో విశ్వకర్మ యోజన ఈ పథకం అమలు చేయడం జరిగిందని అన్నారు.ఈ శిక్షణ కాలంలో రుణాగ్రహితలకు పథకంకు సంభవించిన రూ.15,000 వరకు టూల్ కిట్ ప్రోత్సహకం అందిస్తుందని అన్నారు.. వృత్తి శిక్షణ కేంద్రంలో 7రోజుల ప్రాథమిక శిక్షణ పూర్తి అయిన తర్వాత రోజుకు రూ.500 ఇవ్వడం జరుగుతుందని అన్నారు.లక్ష రూపాయలు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరికి 30 వేల రూపాయలు సగం వడ్డీ మరియు ట్రైనింగ్ ఖర్చు, టూల్ కిట్టు 15 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.18 రకాల చేతివృత్తులు కార్పెంటర్, కమ్మరి, గోల్డ్ స్మిత్, కుమ్మరి, మేస్త్రీలు, చాప ,చీపుర్లు, మొదలగు పనిచేసే వారికి ఈ పథకం వర్తింపచేస్తుందని మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2029 కల్లా దేశాన్ని మూడవ స్థానంలో నిలపాలని అలాగే 2047వ సంవత్సరానికి స్వతంత్రం వచ్చి వందేళ్లు అవుతుందని అందుకే దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాసు, అసెంబ్లీ పోటీచేసిన అభ్యర్థి బలిగేర శివారెడ్డి, కౌన్సిలర్ రజక జయశ్రీ,బిజెపి సీనియర్ నాయకులు రజక నర్సింహులు, ఓబీసీ ఉపాధ్యక్షుడు డబ్బిలేటి నరసింహ, తదితరులు హాజరయ్యారు..