ప్రతి చిన్నారి నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

Jun 29, 2026 - 05:32
 0  146
ప్రతి చిన్నారి నిండు జీవితానికి  రెండు  పోలియో చుక్కలు

తిరుమలగిరి 29 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ 

పల్స్ పోలియో కార్యక్రమం తిరుమలగిరి X- రోడ్ లో తుంగతుర్తి శాసనసభ్యులు  మందుల.సామెల్  పల్స్ పోలియో కేంద్రాన్ని సందర్శించి పోలియో చుక్కలు వేయడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలియజేయడం జరిగినది. పోలియో చుక్కలు వేయించడం వలన పోలియో వ్యాధి రాకుండా నివారించవచ్చు అని అనారు. అందువలన ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు.పల్స్ పోలియో చుక్కలు వేయించడం వలన ప్రతి బిడ్డ పోలియో వ్యాధికి గురికాకుండా ఉంటారని పోలియో రహిత దేశంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి