ప్రజావాణి పిర్యాదుల పై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులు 58
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యపేట, 07 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తు లను పరిష్కరించాలని తెలిపారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ప్రతి కార్యాలయంలోని ఫైల్స్ అన్ని సక్రమంగా ఉంచుకోవాలని ప్రతి కార్యాలయ సిబ్బంది అటెండెన్స్ తప్పనిసరిగా ఫేస్ రికగ్నేషన్ యాప్ లో నమోదు చేయాలని, కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయంలో ఫైల్స్ సరిగా లేకపోయినా, శుభ్రంగా ఉండని కార్యాలయాల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 28 దరఖాస్తులు, మున్సిపాలిటీ 6, డిఆర్డిఏ 4, డిపిఓ 4, మిగిలిన 20 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 58 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే సీతారామా రావు, సీఈఓ జడ్పీ శిరీష ఆర్డీవో వేణు మాధవరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు హాజరైనారు