ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమస్యలను పరిష్కరించాలి

డి.ఆర్. ఓ. వి. రవి కుమార్

Aug 31, 2026 - 18:59
 0  0
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమస్యలను పరిష్కరించాలి

ములుగు జిల్లా, ఆగస్టు :31 : ప్రజావాణి కార్యక్రమంలో అర్జిదారులు సమర్పించిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డి.ఆర్. ఓ. వి. రవి కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ (ఐ డి ఓ సి) సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డి.ఆర్. ఓ. వి. రవి కుమార్ ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 33 దరఖాస్తులు అందగా వాటిలో భూ సమస్యలకు సంబంధించి 14, ఇందిరమ్మ ఇండ్లకు 04, పెన్షన్లకు 02, ఇతర శాఖలకు సంబంధించినవి 13 దరఖాస్తులు ఉన్నాయి.  డి.ఆర్. ఓ. వి. రవి కుమార్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందని తెలిపారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తుకు అధికారులు ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333